ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: గోరంట్ల మాధవ్ ఎక్కడ ఉన్నాడో తెలియజేయాలి

Ambati Rambabu: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్‌పై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం పాలెం పోలీస్ స్టేషన్ వెనక నుంచి గోరంట్లను కారులో తీసుకెళ్లారని తమకు తెలుస న్నారు అంబటి. అయితే గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలపాలని డిమాండ్ చేశారు. తాము పీఎస్‌కు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు అంబటి.
ఇక కొందరు టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. చేబ్రోలు కిరణ్‌ను పెంచి షోషించింది చంద్రబాబే అంటూ విమర్శలు చేశారు. అంతేకాదు కార్య కర్తలను చెలరేగమని మంత్రి నారా లోకేష్‌యే రెచ్చగొడుతున్నారని అంబటి ఆరోపించారు.