Dharmendra: ఆసుపత్రి నుంచి ధర్మేంద్ర డిశ్చార్జ్

Dharmendra: బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడ్డ ఆయన ఇప్పుడు కోలుకున్నారు. మరణ వార్తలు అపోహలుగా తేలాయి.
బాలీవుడ్ విలక్షణ నటుడు, సీనియర్ స్టార్ ధర్మేంద్ర నేడు ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. సెలబ్రిటీలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ ప్రతీత్ సంధానీ మాట్లాడుతూ, “ఉదయం 7:30 గంటలకు డిశ్చార్జ్ చేశాం. కుటుంబం ఇంటి చికిత్స కోరింది” అని తెలిపారు. నవంబర్ 10న శ్వాస సమస్యలతో హాస్పిటల్ లో చేరారు దర్మేంద్ర. వెంటిలేటర్‌పై చికిత్స అని వార్తలు వచ్చాయి.
నిన్న ఆయన మరణ వార్త సోషల్ మీడియా, నేషనల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. కూతురు ఈషా డియోల్, “మా నాన్న బ్రతికే ఉన్నాడు, చికిత్సలో ఉన్నారు” అని పోస్ట్ చేశారు. హేమమాలిని కూడా మరణ వార్తలను ఖండించారు. “బ్రతికి ఉన్నవారిని చనిపోయారని ప్రచారం చేయడం అగౌరవం. గోప్యతకు గౌరవం ఇవ్వండి” అని మండిపడ్డారు.



