ఆంధ్ర ప్రదేశ్
Nadendla: స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

అల్లూరి జిల్లా అరకులోయలో త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అరకులోయ పర్యటనలో భాగంగా నాదెండ్ల కీలక సమాచారం అందించారు. ఈనెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
గిరిజన సహకార సంస్థతో కలిసి రేషన్ డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా ఆధనికీకరించనున్నామన్నారు. ఇప్పటివరకు దీపం పథకం ద్వారా కోటి మంది లబ్ధిదారులకు గ్యాస్ అందిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు.



