సినిమా

Balakrishna: బాలయ్య బర్త్‌డే స్పెషల్.. ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్! ఆయన బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చేసింది.

అఖండ 2 షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య బర్త్‌డే స్పెషల్‌గా జూన్ 10న ఫ్యాన్స్‌కి పలు ట్రీట్‌లు సిద్ధమవుతున్నాయి. అయితే, అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా బాలయ్య మాస్ హిట్ చిత్రం ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్ ఖరారైంది. జూన్ 7 నుంచి థియేటర్స్‌లో సందడి చేయనున్న ఈ చిత్రం ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.

జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో మణిశర్మ సంగీతంతో ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. బాలయ్య పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, మాస్ డైలాగ్స్‌తో ఈ సినిమా మరోసారి థియేటర్స్‌లో హవాని చూపించనుంది. అఖండ 2 నుంచి కూడా ఓ స్పెషల్ అప్‌డేట్ రానున్నట్లు సమాచారం. ఈ రీ-రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button