ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతి గౌరవాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని అన్నారు. దేశంలో సుపరిపాలనకు ఎన్టీఆర్ అర్థం చెప్పారని అన్నారు.
పేదల అభ్యునతే లక్ష్యంగా పాలన చేశారని గుర్తు చేశారు. మరో మూడేళ్లలో అందరికి ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. తాను కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లో రాలేదని…. తెలుగు జాతిని బాగు చేయడానికి వచ్చానని సీఎం చంద్రబాబు అన్నారు.



