ఆంధ్ర ప్రదేశ్
TTD: సోషల్ మీడియాలో దుష్ప్రచారాలపై టీటీడీ ఫోకస్

TTD: సోషల్ మీడియాలో దుష్ప్రచారాలపై టీటీడీ ఫోకస్ పెట్టింది. ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ ప్లాట్ ఫాంలలో ఫ్యాక్ట్ చెక్ టీటీడీ అకౌంట్ ప్రారంభించింది. తిరుమలపై సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను అరికట్టేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ చర్యలు చేపట్టింది.
ఫ్యాక్ట్ చెక్ ద్వారా టీటీడీపై వైరల్ అవుతున్న వార్తలు, ప్రచారాలపై వాస్తవాలు తెలుసుకునే అవకాశముంది. మరోవైపు టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రసారాలు, ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.



