ఆంధ్ర ప్రదేశ్
తుఫాన్ ఎఫెక్ట్.. నీట మునిగిన ఇల్లు, పొలాలు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇల్లు, పొలాలు నీట మునిగాయి. తుఫాన్ కారణంగా అతి భారీ వర్షం కురవడంతో తాళ్లపూడి ప్రక్కిలంక రోడ్డుపై వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భారీ వర్షం కారణంగా కోపాలపురం నల్లజర్ల అనంతపల్లి గ్రామాలలో మిర్చి, వేరుశనగ పంటపొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



