ఆంధ్ర ప్రదేశ్

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఉన్నట్లు తెలుస్తోంది. బైకుపై ముగ్గురు జీడీ నెల్లూరు నుంచి ఎట్టేరికి వెళుతుండగా మోతరంగనపల్లి వద్ద బస్సు-బైకు ఢీకొన్నాయి. బైకుపై ఉన్న ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button