తెలంగాణ
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్పు

ఇప్పటికే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇప్పటికే వర్సిటీ పేరు మార్పుపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. అదేవిధంగా జగదీష్ రెడ్డి అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలపై జవాబు చెప్పేందుకు సిద్ధమంటోంది రేవంత్ ప్రభుత్వం.