ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో డేటా సెంటర్ భూములు పరిశీలించిన సీపీఎం నేతలు

విశాఖలో డేటా సెంటర్ పేరుతో రియల్ దందాకు తెరలేపుతున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. డేటా సెంటర్‌కు కేవలం 120 ఎకరాలు చాలని జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు పోటీపడి కార్పొరేట్ సంస్థలకు భూములను ధారాదత్తం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్జీనియా వంటి దేశాల్లో పర్యావరణ హాని చూపించి డేటా సెంటర్లకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. ఏపీలో ప్రజా అవసరాలను, పర్యావరణాన్ని పక్కనబెట్టి ప్రభుత్వం డేటా సెంటర్‌కు అవసరానికి మించి భూములు కేటాయిస్తోందని సీపీఎం మండిపడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button