తెలంగాణ

Sridhar Babu: అతిపెద్ద ఏరోస్పేస్–డిఫెన్స్ హబ్‌గా తెలంగాణ

Sridhar Babu: సచివాలయంలో ఇటలీ పారిశ్రామిక వేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్–డిఫెన్స్ హబ్‌గా తెలంగాణ దూసుకెళ్తుందని అన్నారు.

అవియానిక్స్, రాడార్, సెన్సార్ సిస్టమ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. న్యూ-స్పేస్, చిన్న ఉపగ్రహాల రంగంలో పెట్టుబడులకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. కాంపోనెంట్ తయారీ, సప్లై చైన్‌లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు మంత్రి శ్రీధర్ బాబు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button