తెలంగాణ
Hyderabad: రూ.4 వేలకే ల్యాప్ టాప్.. ఎగబడ్డ జనం

Hyderabad: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ సంస్థ 4 వేలకే ల్యాప్‌టాప్ అని బంపర్ సేల్ ప్రకటించడంతో.. జనం ఎగబడ్డారు. తక్కువ ధరకు బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు లభిస్తాయనే ఆశతో వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రద్దీ గంట గంటకు పెరుగుతూ వెళ్లి దుకాణం ముందు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అయితే, అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్ స్టాక్ పూర్తిగా అయిపోయిందని నిర్వాహకులు వెల్లడించారు. దీంతో గంటల తరబడి ఎదురుచూసిన పలువురు వినియోగదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు.



