ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: కుటుంబ సభ్యులతో భోజనం చేసిన జగన్

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న జగన్ తాజాగా జరిగిన పులివెందుల పర్యటనలో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు.
అందులో భాగంగానే జగన్ ఫ్యామిలీలో ఉన్నవారిని పేరుపేరునా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు .ఇటీవల వివాహం జరిగిన ఒక జంటకు విందు ఇచ్చే క్రమంలో జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



