తెలంగాణ
Nalgonda: స్కూల్ బస్సు కింద పడి ఐదేళ్ల చిన్నారి మృతి

Nalgonda: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. తోరగల్లు గ్రామానికి చెందిన చిన్నారి స్కూల్‌కు వెళ్తుండగా.. దుప్పలపల్లి రోడ్డులో ప్రైవేట్ స్కూల్ బస్సు చిన్నారి మీదికి దూసుకెళ్లింది. చిన్నారి మృతితో తొరగల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



