ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం

Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని దీపావళి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించింది టీటీడీ. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. గరుడాళ్వార్‌కు ఎదురుగా అలంకరించగా మరో పల్లకిలో స్వామివారి సేనాధిపతి విష్వక్సేనులు ఎడమవైపు అలంకరించారు.

అనంతరం అక్కడ ఉత్సవమూర్తులు, మూల విరాట్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నివేదనలు, హరతులు, అరగింపులు సమర్పించడంతో దీవావళి ఆస్థానం ముగిసింది. ఆస్థానం అనంతరం సామన్య భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు ఆలయ అధికారులు. మరోవైపు దీపావళి ఆస్థానం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button