ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి క్షేత్రంలో న్యూ ఇయర్ వేడుకలు

Tirumala: నిత్యం గోవింద నామస్మరణలతో మారుమ్రోగే తిరుమల శ్రీవారి క్షేత్రంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భక్తులు పెద్ద శ్రీవారి ఆలయ ప్రాంగణానికి చేరుకొని హ్యాపీ న్యూఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరికి ఒకరు శుభకాంక్షలు చెప్పుకున్నారు. కొందరు భక్తులు మిఠాయిలు పంచుకుని, వినూత్నంగా న్యూఇయర్ కి స్వాగతం పలికారు.
సంవత్సరంలో తొలి నిమిషాలు ఆ దేవదేవుడి సన్నిధిలో గడిపే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని భక్తులు అంటున్నారు. తెలిసో తెలియకో గడిచిన ఏడాదిలో చేసిన తప్పులను మన్నించి కొత్త ఏడాది ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా కృపా కటాక్షలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్ధించినట్లు భక్తులు చెబుతున్నారు.



