అంతర్జాతీయం

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఐరోపాలో ఎండల మంటలు

ఎల్‌నినో ప్రభావం.. పర్యావరణ మార్పులు.. వెరసి ఐరోపా ఖండాన్ని వేడిగాలులు వణికిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా పెరిగిన ఉష్ణోగ్రతలు వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ ఏడాది జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో ఐరోపాలోని 854 నగరాల్లో ఏకంగా 50 వేల 391 మంది మరణించినట్లు తెలుస్తోంది.

వీరిలో దాదాపు 32 వేల 619 మరణాలకు శిలాజ ఇంధనాల వినియోగం కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతలే కారణమని పరిశోధకులు అంచనా వేశారు. 2022 వేసవితో పోలిస్తే ఈసారి మరణాలు 71 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఫ్రాన్స్‌లో 43.8 డిగ్రీలు, జర్మనీలో 41.7 డిగ్రీలు, బ్రిటన్‌లో 37.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరణించిన వారిలో సగానికి పైగా 85 ఏళ్లు దాటినవారే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యమే ఈ విపత్కర పరిస్థితికి కారణమని అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button