ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది.
ఈ మేరకు ఢిల్లీకి చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్‌తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.