సినిమా

‘పెద్ది’లో శ్రీలీల స్పెషల్ సాంగ్?

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో స్పెషల్ ఫోక్ సాంగ్ కోసం శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఓ స్పెషల్ ఫోక్ సాంగ్ కోసం యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో శ్రీలీల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందనే ఊహాగానాలు వచ్చాయి.

ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్ కోసం ఆమె దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. జూనియర్ సినిమాలో వైరల్ సాంగ్‌తో శ్రీలీల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది మార్చ్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button