ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది . సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది. దీంతో పాటుగా పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.