తెలంగాణ
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. హైవే బిడ్జ్రిపై నుండి లారీ బోల్తా

Road Accident: సంగారెడ్డి జిల్లా నాందెడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగుపేట హైవే బిడ్జ్రిపై నుండి లారీ బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో లారీ క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్ నరకయాతన అనుభవించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సహాయంతో డ్రైవర్ను బయటకు లాగారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.