ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి లోకేశ్ కౌంటర్

Nara Lokesh: వైస్ చాన్సలర్ల రాజీనామాపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వాలని కోరారు. ఆధారాలు ఇస్తే ఇప్పుడే విచారణకు ఆదేశిస్తానన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.
వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి అని అన్నారు. గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయని, ఎవరు బెదిరించారో చెప్పమనండి అంటూ మంత్రి మండిపడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు. వీసీలు తప్పుచేశారు కనుకే రాజీనామా చేసి వెళ్లిపోయారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.