తెలంగాణ
Basara: నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు

Basara: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వసంత పంచమి పర్వదినం సందర్భంగా అమ్మవారికి కలెక్టర్ అభిలాష ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కలెక్టర్కు ఆలయ సిబ్బంది, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ అభిలాష ప్రత్యేక పూజలు నిర్వహించారు.