తెలంగాణ
Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ హయత్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో యువకుడు రోహిత్‌పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ తన కూతుర్ని బెదిరించాడని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. మనస్తాపానికి గురై తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.