తెలంగాణ
Himayat Nagar: హైదరాబాద్ హిమాయత్ నగర్లో వ్యక్తి హత్య

Himayat Nagar: హైదరాబాద్ హిమాయత్ నగర్లో వ్యక్తి దారుణ హత్య కలకలం రేగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిప్టులో ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తుంది. ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.