Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు రిలీజ్‌పై సస్పెన్స్.. మళ్లీ వాయిదా?

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. మే 9న గ్రాండ్ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించినా తాజా సమాచారం షాకింగ్ గా మారింది..
పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వింటేజ్ పవన్‌ని చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌తో హైప్ పీక్స్‌లో ఉంది.
అయితే, మే 9 రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. ఇంకా కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని చిత్ర వర్గాల సమాచారం. దీంతో రిలీజ్ మళ్లీ వాయిదా పడే చాన్స్ ఉందని టాక్. ఈ భారీ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



