KGF 3: కేజీఎఫ్ 3లో అజిత్ కుమార్

KGF 3 : కన్నడ రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన ‘కేజీఎఫ్’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాయి. మాస్ ఎలివేషన్స్‌తో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సృష్టించిన ఈ ఫ్రాంచైజీపై ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై తాజాగా సంచలన చర్చ మొదలైంది.
కొన్నాళ్ల క్రితం ‘కేజీఎఫ్ 3’లో తమిళ స్టార్ అజిత్ కీలక పాత్రలో కనిపిస్తారనే పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ డైలాగులను ఉటంకించడంతో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. దీంతో అజిత్ ‘కేజీఎఫ్ 3’లో భాగమవుతారేమోనని అభిమానుల్లో హైప్ పెరిగింది.
ఒకవేళ ఈ కాంబో నిజమైతే, అది బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం! అజిత్ లాంటి మాస్ హీరో, ‘కేజీఎఫ్’ బ్రాండ్‌తో కలిస్తే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించొచ్చు. అయితే, ఇది నిజమా, పుకారేనా అనేది తేలాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాలి.