తెలంగాణ
ఉరి వేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఉరి వేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా నీలిబండ తండాలో ఘటన చోటుచేసుకుంది. వరంగల్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా యువతి నీలా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.