ఆంధ్ర ప్రదేశ్
CPI Narayana: వక్ఫ్ బిల్లుపై వైసీపీ దొంగాట ఆడింది

CPI Narayana: మాజీ సీఎం జగన్‌పై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా జగన్ మాట్లాడకూడదని సీపీఐ నారాయణ అన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తప్పు అని హితవు పలికారు.
వక్ఫ్ బిల్లుపై వైసీపీ దొంగాట ఆడిందని నారాయణ విమర్శించారు. వైసీపీ రాజ్యసభలో ఒకలా, లోక్‌సభలో మరోలా మద్దతిచ్చిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. ట్రేడ్ వార్ మూడో ప్రపంచం యుద్దానికి దారితీస్తుందని నారాయణ తెలిపారు.