తెలంగాణ
MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ

MLAs Defection Case: పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవన్నారు ముకుల్ రోహత్గీ. స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్నాకే జ్యుడిషియల్ సమీక్షకు అవకాశం ఉంటుందన్నారు.
స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదన్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించలేమా అని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయన్న న్యాయమూర్తి స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని జస్టీస్ బిఆర్ గావాయి ప్రశ్నించారు.