సినిమా
Sampoornesh Babu: ఏప్రిల్ 11న సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ విడుదల

Sampoornesh Babu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సంపూర్ణేష్ బాబు, తన వినోదాత్మక నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. తాజాగా ‘సోదరా’ సినిమాతో రాబోతున్నాడు.
అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సంపూర్ణేష్‌తో పాటు సంజోష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో, క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చంద్ర చగంలా నిర్మిస్తున్న ఈ చిత్రం, ఈ వేసవిలో ప్రేక్షకులను అలరించనుంది. చిత్రీకరణ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా, ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో సంపూర్ణేశ్ బాబు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.