తెలంగాణ
Hyderabad: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టి ..

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టి.. రోడ్డుకు అడ్డంగా నిలిచింది కారు. ప్రమాదంలో కారు వెనుక టైరు ఊడింది. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.., చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కారు బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. అయితే మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు.