తెలంగాణ
హైదరాబాద్‌లోని స్కూల్లో తెగిపడ్డ లిఫ్ట్.. చిన్నారికి తీవ్రగాయం

Hyderabad: అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి రఘునాథనగర్లో యూనిసన్ స్కూల్లో పెను ప్రమాదం తప్పింది. రంజాన్ సందర్భంగా లిఫ్ట్‌లో 8 మంది వెళ్తుండగా ఒక్కసారిగా ఓవర్ లోడ్‌తో తెగిపడింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న 12 ఏళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. టెక్నికల్ టీమ్ సహాయంతో లిఫ్ట్ తెరిచి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.