తెలంగాణ
Addanki Dayakar: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే

Addanki Dayakar: బీజేపీ, బీఆర్ఎస్లపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు అద్దంకి. మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి లేకపోవడానికి బీజేపీ మనుగడకు ముడిపడి ఉందన్నారు. ఉప ఎన్నికలు వస్తే సత్తా చూపిస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని అద్దంకి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పై పోరాడుతూ బీజేపీకి ఓట్లు వేయిస్తున్నారని అందుకు ఇదే నిదర్శనమన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఎంతకైనా దిగజారుతుందన్నారు. ఐడియాలాజికల్ వార్ లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీని కాంగ్రెస్ భూ స్థాపితం చేయడం ఖాయమన్నారు అద్దంకి.