తెలంగాణ
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్

వరంగల్ జిల్లా వాసుల కల త్వరలో నెరవేరనుంది. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఆమోదిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణకు తెలంగాణ సర్కార్ 205 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తైంది. మరో 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది.