ఆంధ్ర ప్రదేశ్
Buddha Venkanna: బూతులు తిట్టించిన జగన్.. ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నాడు

Buddha Venkanna: మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారన్నారు.
వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారని.. ఆరోజు వారందరితో బండ బూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. వాళ్లని ప్రోత్సహించాడు కాబట్టే జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు.