తెలంగాణ
Eatala Rajendar: మోడీని తిడితే ఏమౌతుందో కేసీఆర్‌కి తెలిసింది.. త్వరలో రేవంత్‌కు కూడా తెలుస్తుంది

Eatala Rajendar: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీని తిడితే ఏమౌతుందో కేసీఆర్‌కి తెలిసిందని.. త్వరలో రేవంత్‌కు కూడా తెలుస్తుందన్నారు.
రేవంత్ ఢిల్లీకి వెళ్లి మోడీని పెద్దన్న అంటాడని.. ఇక్కడకు వచ్చి ప్రగల్భాలు పలుకుతారని చెప్పారు. రేవంత్ తీరు.. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు ఉందన్నారు ఈటెల.