తెలంగాణ
Revanth Reddy: తెలంగాణ బడ్జెట్‌పై నేడు సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy: తెలంగాణ బడ్జెట్‌పై నేడు సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే ఉదయం 11గంటల 15నిమిషాలకు మైక్రోసాప్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకి టీ-హబ్‌లో గూగుల్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంటారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు HGCLలో.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.