తెలంగాణ
KTR: ఈనెల 17న ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలన్న కేటీఆర్

KTR: హరితహారం ద్వారా తెలంగాణ భూ తల్లికి ఆకుపచ్చని చీర చుట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఆయన జన్మదినం సందర్బంగా.. ఈనెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని.. పిలుపునిచ్చారు కేటీఆర్. కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు మాజీ ఎంపీ సంతోష్.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కేటీఆర్ విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్కు మనమిచ్చే పుట్టినరోజు కానుక అన్నారు కేటీఆర్.