తెలంగాణ
Hyderabad: బాలానగర్ లో అగ్ని ప్రమాదం..

Hyderabad: హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. గాంధీనగర్లో సూర్య తేజ ఇండస్ట్రీస్, లిఫ్ట్ గ్రిల్స్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.