తెలంగాణ
Nizamabad: ఆడపిల్ల పుట్టిందని పేపర్‌లో చుట్టి రోడ్డుపై వదిలేసిన దుండగులు

Nizamabad: ఆడపిల్ల పుట్టిందని పేపర్‌లో చుట్టి రోడ్డుపై వదిలేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్లి గ్రామంలో చోటు చేసుకుంది. పసికందును ఓ పేపర్‌లో చుట్టి దుండగులు రోడ్డుపై వదిలేశారు. పసికందు ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పసికందును అంగన్‌వాడీ టీచర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



