తెలంగాణ
Rangareddy: దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

Rangareddy: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇంజనీర్ కాలేజ్ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై కాలేజ్ యజమాని డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున హాస్టల్‌లోకి వెళ్లి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.
తెల్లవారుజామున కావడంతో విద్యార్థినులందరూ నిద్రలో ఉన్నారు. ఈ క్రమంలో కామాంధుడు ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ ఘటనపై విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.