తెలంగాణ

KTR: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు

డీలిమిటేషన్ బిల్లుకు భారత రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించింది. కేంద్రం తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై బీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గకుండా కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలోనే మద్దతు ప్రకటించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.

గతంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళన వ్యక్తం చేశామని, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం బిల్లులో మార్పులు చేసిందని చెప్పారు. ఇదే సమయంలో డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసలు ఈ బిల్లుపై కాంగ్రెస్ అభిప్రాయం ఏంటో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button