ఆంధ్ర ప్రదేశ్
CM Chandrababu: కేంద్రం సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం

CM Chandrababu: HAM మోడల్‌తో చాలా వినూత్నంగా తాము ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.. కేంద్రప్రభుత్వ సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీని సర్వనాశనం చేశారని సీఎం ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వైసీపీ హయాంలో దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. డబ్బులు లేవని పనులు ఆపేస్తే సమస్యలు పెరిగిపోతాయని అన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా తాము నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.



