తెలంగాణ
హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫాక్స్ సాగర్ సమీపంలోని ఓ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.



