అంతర్జాతీయం
కాగ్నిజెంట్‌కు అమెరికాలో భారీ షాక్

అమెరికాలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌కు భారీ షాక్ తగిలింది. గ్రీన్కార్డ్కు కీలకమైన శాశ్వత లేబర్ సర్టిఫికేషన్.. అంటే PERM ఫైలింగ్స్‌ను అమెరికా కార్మిక శాఖ నిలిపివేసింది. కాగ్నిజెంట్‌తో పాటు డేటా మేనేజ్మెంట్ సంస్థ క్లౌడెరా PERM ఫైలింగ్స్పైనా సస్పెన్షన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డిఎస్పోసిటో ఈ విషయాన్ని ప్రకటించారు.
వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి రెండు సంస్థలకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. అమెరికన్ ఉద్యోగులకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఫ్యాక్ట్స్, ఫ్రాడ్, ఫైనాన్స్ అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.



