తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

తెలంగాణ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన, గత ఐదు రోజులుగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు.

మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడికి పలువురు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుడికి తుది వీడ్కోలు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button