News

116 ఏళ్ల వయసులో తిరుమలకు కాలినడక.. నవనీతమ్మకు శ్రీవారి వీఐపీ దర్శనం

116 ఏళ్ల బామ్మ నవనీతమ్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బామ్మ నవనీతమ్మ కాలినడక వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. దీంతో శ్రీవారిపై బామ్మ నవనీతమ్మ భక్తి యువతతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకమంటూ సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.ఆ మేరకు స్పందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నవనీతమ్మ చిరునామా తెలుసుకొని వారికి తన కోటాలో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.

నవనీతమ్మను టీటీడీ చైర్మన్ కార్యాలయం సిబ్బంది దగ్గర ఉంది మూలవిరాట్టు దర్శనం చేయించారు. దర్శన అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు. తమిళనాడు నుంచి నవనీతమ్మ తిరుమలకు మహపాదయత్రగా వచ్చిందని, దర్శన భాగ్యం కల్పించిన ఛైర్మన్ బిఆర్ నాయుడుకు కృతజ్ఞతలు కుటుంబ సభ్యులు తెలిపారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button