జాతియం

సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హీరో విశాల్

తమిళనాడు సీఎం విజయ్‌ నిర్ణయాన్ని హీరో విశాల్‌ తప్పుబట్టారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్‌మోహన్‌ను నియమించడాన్ని వ్యతిరేకించారు. సినీ పరిశ్రమ గురించి తెలిసిన వ్యక్తికి కాకుండా, అనుభవం లేనివారికి మంత్రిత్వశాఖను కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. సీఎం విజయ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్కూళ్లు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు మూసివేతకు ఆదేశాలు ఇవ్వడంపై ప్రశంసలు కురిపించిన విశాల్‌.. సినిమాటోగ్రఫీ మంత్రి నియామకం విషయంలో మాత్రం బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తంచేశారు.

ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి సీఎం విజయ్‌ మంత్రి పదవులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అయితే, రాజ్‌మోహన్‌కు సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించడం తనను ఎంతగానో నిరుత్సాహ పరిచిందని తెలిపారు.. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సినీ రంగానికి సంబంధించిన సమస్యలను, విజ్ఞప్తులను ఏ అనుభవమూ లేని వ్యక్తికి ఎలా తెలియజేయగలమని ఆయన ప్రశ్నించారు. 30 ఏళ్ల సినీ అనుభవం ఉన్న వ్యక్తిగా తమకు క్షేత్రస్థాయిలో సమస్యలు పూర్తిగా తెలుసని అలాంటిది, ఏ అనుభవమూ లేని వారికి ఎలా వివరించగలమని విశాల్ స్పష్టంచేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button