జాతియం
దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్‌కు గరిష్టంగా 3 రూపాయల వరకు ధరలు పెంచినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిపాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు అధికమవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో సాధారణ ప్రజలపై మరింత భారం పడనుంది. ముఖ్యంగా రోజువారీగా వాహనాలు వినియోగించే ఉద్యోగులు, రవాణా రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇక పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాల వారీగా వ్యాట్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి.



